28 September, 2024

మంజీరా రచయితల సంఘం38వ వార్షికోత్సవం - ప్రధాన కార్యదర్శి నివేదిక


మంజీరా రచయితల సంఘం

తమంజీరా రచయితల సంఘం

38వ వార్షికోత్సవం సందర్భంగా 

ప్రధాన కార్యదర్శి నివేదిక 

----------------------------------


బ్రతికేది బ్రతికించేది పరిపూర్ణత సాధించేది సాహిత్యమని భావించి లుప్తమవుతున్న మానవ విలువలను పెంపొందించడానికి, అనుబంధాలను ఉన్నతీకరించడానికి సామూహిక బ్రతుకుల్ని సంపద్వంతం చేయాలని తలంపుతో తాత్విక ఆలోచనలోంచి పరవళ్ళు తొక్కుతూ పారే నది మంజీరను స్ఫూర్తిగా తీసుకొని మంజీరా రచయితల సంఘం 1986 జూలై 20న  పురుడుపోసుకుంది. 

నడిచొచ్చిన తోవెంట గాయాలను పునికి చూసుకుంది.
అక్షరాలను పిండి పసరు పోసి కట్టు కట్టి ఉత్తేజపరుస్తుంది.

కల్లోల సమాజంలో కలలాను ఎక్కు పెట్టింది. గళాలను సవరించింది గానమై ప్రజల్ని ఏకం చేసింది. గజ్జ కట్టి, పాటెత్తి కళారూపాలను ప్రదర్శించి ప్రజా ఉద్యమాలకు మద్దతై నిలిచింది.
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూనే ఉంది.

29-09-2019న 
 ముల్లపూడి విశాల్ శర్మ ప్రాంగణంలో జరిగిన 32వ వార్షికోత్సవమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన  నాటి భారీ నీటిపారుదల శాఖా మాత్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ప్రసంగిస్తూ 

మెదక్ జిల్లా కాలేశ్వరం వల్ల మంజీరా నదితో సస్యశ్యామలం కానుందనీ ఇప్పటి వరకే ఆ పనిని సాహిత్య పరంగా మరసం చేసిందని పేర్కొన్నారు. ఒక సంస్థ మూడున్నర దశాబ్దాల వైపు దూసుకెల్లడం అంటే మామూలు విషయం కాదు. ఇలాగే ముందుకు సాగాలని కోరారు. 

పౌరస్థితి భారత రాజ్యాంగము పరిస్థితులు అన్న అంశముపై నాటి టీఎస్పీఎస్సీ చైర్మన్ గంట చక్రపాణి గారు రాజ్యాంగ గొప్పతనాన్ని సాధికారికంగా వివరించారు. 
నందిని సిధా రెడ్డి గారు ప్రసంగిస్తూ నేటి కవుల పైన రాజకీయ నాయకుల పైన బృహత్తరమైన బాధ్యత ఉన్నది. అది ఏటికి ఎదురీదే బాధ్యత అని, ప్రజల్ని ఉత్సాహ పరచడమే మరసం సృజన కారుల సాహిత్య లక్షణం అని పేర్కొన్నారు. 

దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కథలు కవితలు పాటలు కళారూపాలు వీధి నాటికలు మొదలైన వాటితో చైతన్యం నిఃపుతూనె ఉంది. 

"వర్తమాన కథ -జీవితం"అన్న అంశంపై
ఆచార్య కాత్యాయని విద్మహే గారు, 

"కవిత్వంలో మానవ విలువలు" అను‌ అంశంపై
ఆచార్య కాశీం గారు  వినూతన రీతిలో విశ్లేషించారు.

నేను నరసింహారెడ్డి గారు మరియు వారాలు ఆనంద గారి సభాధ్యక్షతలో 
 కవి సమ్మేళనం నిర్వహించబడినది. ఈ కవిగాయక పఠనంలో జిల్లాలోని కవులతో పాటు రాష్ట్రంలోని నలుమూలల కవులు తమ కవితలు వినిపించారు.

11 నవంబర్ 2019 న 'మంజీర స్వరం' కార్యక్రమం పేరిట "వర్తమాన వచన కవిత్వము - విశ్లేషణ"అనే అంశంపై పప్పుల రాజిరెడ్డి గారు ప్రసంగించారు.

తేది: 27 డిసెంబర్ 2019 నుంచి
'కవిత్వంతో కలుద్దాం' అన్న శీర్షికతో పక్షానికి ఒక రోజు చొప్పున పాత కొత్త కవులతో ప్రెస్ క్లబ్లో కవి సమ్మేళనం నిర్వహించబడినది. కవిత పఠనాన్ని యూట్యూబ్లో నిక్షిప్తం చేయనైనది. 

తేది: 26-05-2020న కవిత్వం జీవితం అంశంపై నందిని సిద్ధారెడ్డి గారి ప్రసంగం జూన్ వేదిక నిర్వహించారు. 

28 మే 2020 న గూగుల్ వేదికగా
కవిత్వము- శైలి అను అంశం పై ఎం నారాయణ శర్మ గారు.

8 జూన్ 2020 న‌ గూగుల్ వేదికగా
"తెలంగాణ నవల వికాసం" అనే అంశం పై డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి గారు ప్రసంగించారు.

20 జూన్ 2020న గూగుల్ వేదికగా తులనాత్మక సాహిత్య అధ్యయనంపై ఏనుగు నరసింహారెడ్డి గారు విశ్లేషణత్మకంగా వివరించారు.

పత్రిక ఒకటి ఉన్న పదివేల సైన్యం 
పత్రిక ఒకటి యున్న మిత్రకోటి అన్న స్ఫూర్తిని స్వీకరించిన జర్నలిస్టు సోలిపేట రామలింగారెడ్డి గారు ప్రజా అభిమానం చూరగొని ఎమ్మెల్యే గా గెలుపొందారు. సోలిపేట రామలింగారెడ్డి గారు 06-08-2020న అందరిని విడిచి అందని తీరాలకు వెళ్ళారు.  తేది: 15 ఆగస్టు 2020న  "ప్రజల మనిషి లింగన్న యాదిలో..." అనే స్మారక సంచికను మహతి ఆడిటోరియం గజ్వేల్ సంస్మరణ సభలో గౌరవనీయులు హరీష్ రావు గారు ఆవిష్కరించారు.

కల్లోలం రేపిన కరోనాకాలంలో 
జూమ్ వేదికగా తేది: 14 సెప్టెంబర్ 2020 నుంచి 03-01-2021 మధ్యకాలంలో  "కవిత్వ నైపుణ్యాలు" అనే అంశంపై గౌరవనీయులు సిధారెడ్డి గారి చేత వారానికి ఒక ప్రసంగం చొప్పున 15 వారాల పాటు కవిత్వం పై లోతైన ప్రసంగాలు చేశారు.  

పుస్తకావిష్కరణలు: ప్రముఖ కవి రచయిత
డాక్టర్ సిద్దెంకి యాదగిరి గారి కవితా సంపుటి 'అచ్చు' ను 28 జనవరి 2021న ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో నందిని సిధారెడ్డి గారు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి శ్రీనివాసు గారు, కూర మాణిక్య రెడ్డి గారు, సత్తు యాదవ రెడ్డి గారు మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రముఖ కవి గాయకులు రచయిత డాక్టర్ తైదల అంజయ్య గారి జలతంత్రి కవితా సంపుటిని కవిత్వ లెజెండ్ కె. శివారెడ్డి చేతుల మీదుగా ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించ బడింది.

నేటి సమాజంలో 2021 నవంబర్ 7వ తేదీన మానవీయ సంబంధాలు అనే అంశంపై గజ్వేల్ లో సదస్సు నిర్వహించబడినది

వివిధ ప్రజా సంఘాలతో మంజీర పాత్ర: 
ప్రజాయుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభను ప్రజా సంఘాలతో కలిపి నిర్వహించనైనది.

పౌరస్థితి -
భారత రాజ్యాంగము - పరిరక్షణ అన్న అంశంపై విపంచి కళావిలయంలో సమావేశం నిర్వహించడంలో కీలక భూమిక పోషించింది. అట్టి సమావేశంలో జర్నలిస్టు ఆచార్యులు కే నాగేశ్వర్ గారు ప్రధాన వక్త. 

కాళోజి జయంతి సభను ప్రెస్ క్లబ్ లో నిర్వహించనైనది. 

తెలంగాణ సారస్వత పరిషత్ వారిచే జిల్లాల చరిత్ర లో భాగంగా సిద్దిపేట  జిల్లా సమగ్ర స్వరూపాన్ని లిఖించగా అందులో విశేషమైన భూమిక పోషించింది మరసం సభ్యులే అన్న విషయాన్ని గమనించాలి.

10 సంవత్సరాల తెలంగాణ వేడుకలలో మంజీరా జిల్లాస్థాయిలో ప్రధాన భూమికను పోషించింది. 

అంతర్జాలంలో మంజీరా రచయితల సంఘం: 
32 వ వార్షికోత్సవం అనంతరం ఆ సమావేశంలో వక్తల ప్రసంగాలు, పాటలు, కవి గాయక సమ్మేళనాలను యూట్యూబ్ లో భద్రపరచడానికి మరసం యూట్యూబ్ ఛానల్ ను 07-10-2019న ప్రారంభించాం.
అదే మాసంలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించాము.
ప్రసార మాధ్యమాల్లో కీలకపాత్ర వహించే ఫేస్బుక్ లోను, ఫేస్ బుక్కులో మంజీరా గ్రూపు 2019 అక్టోబర్ మాసం నుంచి నిరంతరం నిర్వహిస్తున్నాము. 

అన్ని కార్యకలాపాలను, పుస్తకాలను, వార్తలను, అన్నింటిని బ్లాగ్ స్పాట్లో నిల్వ ఉంచి అందరికీ అందుబాటులో మంజీరా ఉండడానికి మంజీరా బ్లాగ్ స్పాట్ ని క్రియేట్ చేసాము.

సంకలనాలు:
ఉమ్మడి మెదక్ జిల్లాలో సందర్భానుకూలంగా వివిధ కవితా సంకలనాలను, కథ సంకలనాలను, వ్యాసం సంకలనాలను ప్రచురించిన సంఘం మంజీరా. తొలి కవితా సంకలనం 'మొగులైంది', ,ఎడపాయలు',  'పాట సంతకం', మొదలైన కవితా సంపుటాలు వెలువరించింది.  32 వ వార్షికోత్సవంలో జరిగిన కవి సమ్మేళనంలోని కవితలను 'జోటపాటలు'గా పుస్తకం ప్రచురించబడిందని తెలియజేయుటకు  సంతోషిస్తున్నాం. 

'నూతనం, మా పనితనం' అన్నట్టుగా ముందు తరాలకు సాహితీ పరిమళాల్ని అందజేయడమే మంజీరా రచయితల సంఘం ప్రధాన లక్షణమై ఉన్నది.
మానవతా, భావుకత మా వస్తు శిల్పాలు, 
చైతన్య సాగరం మాది మంజీరా సంఘం మాది అంటూ సాగుతూనే ఉంటుంది. 

జై మంజీరా


-డా. సిద్దెంకి యాదగిరి 
ప్రధాన కార్యదర్శి 
మంజీరా రచయితల సంఘం..


No comments:

Post a Comment