23 February, 2020

మంజీరా రచయితల సంఘం

 

అంతర్జాలం లో మంజీరా రచయితల సంఘం


అంతర్జాలం లో మంజీరా రచయితల సంఘం ఇక మీదట తన కార్య కలాపాలను కొనసాగిస్తుందనీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. రంగాచారి, డాక్టర్ సిద్దెంకి యాదగిరి లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

 గత 33 సంవత్సరాలుగా మంజీరా రచయితల సంఘం ఎన్నో వినూత్నమైన ఇటువంటి కార్యక్రమాలు చేపట్టింది. సాహితీ క్షేత్ర అభివృద్ధికి పాటుపడింది సాహిత్య విలువల్ని సాహిత్య కృషికి సాహితీ ప్రచారానికి విశేషమైన దృఢ సంకల్పంతో పనిచేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి., సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో సాహితీ కార్యక్రమాలు నిర్వహించింది. పేరుప్రఖ్యాతులు గాంచిన కవులు రచయితలు మేధావులు పిలిపించి చైతన్య సభలను నిర్వహించింది. ప్రజాపక్షం ఆ దిశగా మంజీరా రచయితల సంఘం .  1986లో పురుడు పోసుకుంది అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజాక్షేత్రంలో సాహిత్యం సేద్యం చేస్తూ ఉంది. డాక్టర్ నందిని సిధారెడ్డి గారు, దేశప్తి శ్రీనివాస్ గారు విశేశ్సమైన కృషి సలిపి ప్రజా క్షేత్రము లోకి తీసుకెళ్లారు. ఆ పరంపరను కొనసాగించే క్రమము లో అంతర్జాలము లోకి అందుబాటులోకి తెస్తున్నామని అధ్యక్షులు కె. రంగాచారి వివరించారు.
కొమురవెల్లి అంజయ్య,  కందుకూరి శ్రీరాములు, ఆలాజిపూర్ శ్రీనివాస్, కిషన్, వేముగంటి మురళీకృష్ణ పప్పుల రాజు రెడ్డి, తైదల  అంజయ్య, పొన్నాల బాలయ్య, నందిని భగవాన్ రెడ్డి, గంభీరావుపేట యాదగిరి, సిద్దెంకి యాదగిరి  మొదలైన వారికి మరసం ద్వారా పరిచయమయ్యారు.
ఇప్పుడు అంతర్జాలము లోకి రావడము సాహితీ అభిమానులకు మరింత చేరువవుతుందనీ పేర్కొన్నారు.

No comments:

Post a Comment