08 March, 2023

దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యడం పట్ల మరసం హర్షం

*దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎంపిక పట్ల మంజీరా రచయితల సంఘం హర్షం*      

సిద్దిపేట: ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, మంజీర రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ శాసన మండలి సభ్యునిగా అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం పట్ల మంజీరా రచయితల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గత రెండున్నర దశాబ్దాల కాలం పాటు తెలంగాణ సమాజాన్ని మాట, పాట, ప్రసంగం ద్వారా ఎంతగానో ప్రభావితం చేసిన తెలంగాణ ప్రజల వెంట వెంటాడే గొంతుక గా వాగ్గేయకారులు దేశపతి శ్రీనివాస్ తెలంగాణ సమాజ చైతన్యానికి ఎంతగానో కృషి చేశాడు. 1996వ సంవత్సరంలో జరిగిన మంజీరా పదేళ్ల మహాసభల్లో నందిని సిద్ధారెడ్డి పాట నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ అనే పాట పాడి తెలంగాణ సోయి తెచ్చారు. ఈ పాటను తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక ప్రదేశాల్లో ఆలపించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అధికారికంగా అలసత్వం వహిస్తూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న ఆనాటి ఆంధ్రావలస పాలకుల కుట్రని అందరికీ అర్థమయ్యేలా విప్పి చెప్పారు. దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే కోటాలో శాసన మండల సభ్యులుగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. మంజీరా రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు కే రంగాచారి, కార్యదర్శి యాదగిరి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి అంజయ్య, తైదల అంజయ్య, పప్పుల రాజిరెడ్డి, ఎన్ భగవాన్ రెడ్డి, పొన్నాల బాలయ్య, తోట అశోక్, గంభీరావుపేట యాదగిరి, రాజశేఖర్ లక్ష్మారెడ్డి, సుధాకర్, సత్య కుమార్, మిమిక్రీ మధు మొదలైన మంజీరా రచయితల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.




No comments:

Post a Comment