మరసం 39వ పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్షరం మీద అవ్యాజమైన ప్రేమతో ఆవిర్భవించింది మంజీరా రచయితల సంఘం. కవులమీద మమతానురాగాలతో ఏర్పడింది మరసం.ప్రజలపట్ల బాధ్యతతో బతుకుబంధంతో గళమెత్తింది మంజీరా రచయితల సంఘం. మెతుకుసీమ పరిసరాల మీద, అవసరాలమీద మట్టిబంధంతో పురివిప్పింది మరసం. సమసమాజాన్ని స్వప్నిస్తూ, చైతన్యసాహిత్యం సృష్టిస్తూ నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఎడతెగనినడక మరసానిది. ఉద్వేగాలలో ఉద్యమాలలో ఊగి,మాగి పాడనేర్చిన గాఢానుభవం మరసం.
జులై 20 ,
మంజీరా రచయితల సంఘం పుట్టిన రోజు. మరసం సభ్యులకు, కవులకు,కార్యకర్తలకు,
రచయితలకు,కళాకారులకు,
అతిథులకు,ఆత్మీయులకు,పాత్రికేయులకు, ప్రజాప్రేమికులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు.
No comments:
Post a Comment